సీఆర్పీఎఫ్ అమర జవాన్లకు అవమానం.. రాజస్తాన్ లో నలుగురు కశ్మీర్ యువతుల అరెస్ట్!
- ఉగ్రదాడిని స్వాగతిస్తూ వాట్సాప్ పోస్ట్
- సస్పెండ్ చేసిన నిమ్స్ వర్సిటీ
- కేసు నమోదు చేసిన జైపూర్ పోలీసులు
రాజస్తాన్ లోని జైపూర్ లో నిమ్స్ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్నతల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్ర నజీర్, ఉజ్మా నజీర్ పుల్వామా దుర్ఘటనపై హర్షం వ్యక్తం చేస్తూ తమ వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సదరు విశ్వవిద్యాలయంలో నిరసనలు మిన్నంటాయి. ఈ విషయం వర్సిటీ పెద్దలకు తెలయడంతో నలుగురు విద్యార్థినులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.