KCR: కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్!

  • నేడు కేసీఆర్ జన్మదినం
  • అభినందనలు తెలిపిన ప్రముఖులు
  • వేడుకలకు దూరంగా కేసీఆర్
నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు వైఎస్ఎస్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. "హ్యాపీ బర్త్ డే కేసీఆర్ గారూ. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలి" అని ట్వీట్ చేశారు.

కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా కేసీఆర్ కు శుభాభినందనలు తెలుపుతూ, "తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నా" అని అన్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేసీఅర్ కు అభినందనలు తెలుపుతూ లేఖను పంపారు. కాగా, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.





KCR
Jagan
birthday
Narendra Modi
Ramnath Koving
Twitter

More Telugu News