Telangana: అరుదైన నాయకుడు, పోరాటయోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు!: తండ్రికి కేటీఆర్ బర్త్ డే విషెస్

  • ప్రగతి భవన్ లో మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ
  • కేసీఆర్ నా తండ్రి కావడం గర్వకారణం 
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు నేడు. అయితే పుల్వామా ఉగ్రదాడి జరగడంతో తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులను కోరారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటారు.
తెలంగాణ ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుతూ మా కుటుంబంలో ఒక్కొక్కరం ఒక్కో మొక్కను నాటాం.

అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నా తండ్రి కావడం గర్వకారణం’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో మొక్కలు నాటుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు.
Telangana
TRS
Twitter
birthday wishes
KTR
KCR

More Telugu News