Hardik Pandya: మాజీ లవర్ పాండ్యాతో పెళ్లి వార్తలపై బాలీవుడ్ నటి ఎల్లీ స్పందన

షార్ట్స్‌లో చూడండి
మాజీ బాయ్‌ఫ్రెండ్, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తాను పెళ్లాడబోతున్నట్టు వస్తున్న వార్తపై  బాలీవుడ్ నటి ఎల్లీ అవ్‌రామ్ క్లారిటీ ఇచ్చింది. పాండ్యాను తాను పెళ్లాడబోవడం లేదని తెగేసి చెప్పింది. పెళ్లి వార్తలపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, అటువంటి వార్తలు సిగ్గుచేటని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ఏది ఏమైనా పాండ్యాతో పరిచయం చాలా క్రితమే ముగిసిందని నటి పేర్కొంది. తాను పనిచేసేందుకే ఇక్కడకు వచ్చానని, ఇటువంటి అగౌరవప్రదమైన ప్రచారాన్ని కోరుకోవడం లేదని పేర్కొంది.  

గతేడాది హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వివాహంలో ఈ స్వీడన్ చిన్నది హార్దిక్‌తో కలిసి హల్‌చల్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లాడబోతున్నారని వార్తలు షికారు చేశాయి. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ ఇద్దరూ దూరం జరిగారు. తాజాగా, మరోమారు ఇద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నట్టు వార్తలు రావడంపై అవ్‌రామ్ తీవ్రంగా స్పందించింది.
Go Back to Shorts
Hardik Pandya
Elli AvrRam
Team India
Bollywood
Actress

More Telugu News