పాక్ ను నాలుగోసారి హెచ్చరించిన ప్రధాని మోదీ

  • ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వారిని విడిచిపెట్టం
  • ఉగ్రవాదానికి మారుపేరుగా పాక్ మారింది
  • ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షిస్తాం
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి తీరతామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని, ఉగ్రవాదానికి మారుపేరుగా పాక్ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఈ దారుణ ఘటనకు కారకులైన వారు ఎక్కడా దాక్కోలేరని, ఎంత మంది ఉన్నా, ఎక్కడ దాక్కున్నా ఖాతరు చేసేది లేదని కఠినంగా శిక్షిస్తామని మోదీ హెచ్చరించారు. ఒక్క రోజులో ఈ విధంగా మోదీ హెచ్చరించడం ఇది నాల్గోసారి. అమరజవాన్ల త్యాగాలను వృథా కానీయమని, ప్రతీకార దాడులు జరిపేందుకు భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చామని, ఏ సమయంలో చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్న విషయాన్ని గ్రహించానని, మరోసారి దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని, తగిన ఓర్పు, విశ్వాసంతో వారుండాలని మోదీ సూచించారు.
Go Back to Shorts
india
pm
modi
Pakistan
terrorists
pulwama
Jammu And Kashmir
crpf

More Telugu News