తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని.. హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న మహిళా టెక్కీ!
- మాదాపూర్ లోని లేడీస్ హాస్టల్ లో ఘటన
- వారం రోజుల క్రితమే హైదరాబాద్ కు రాక
- కేసు నమోదుచేసిన పోలీసులు
దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అరుణోదయ హాస్టల్ లో శ్రీవిద్య ఈ నెల 10న చేరింది. ఈ విషయమై మాదాపూర్ పోలీసులు మాట్లాడుతూ.. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధితురాలిది ఆత్మహత్య లేక హత్య అన్నది పోస్ట్ మార్టం తర్వాతే తేలుతుందని వ్యాఖ్యానించారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు హాస్టల్ సిబ్బంది చెప్పారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.