కపిల్ దేవ్ ను అధిగమించిన డేల్ స్టెయిన్

  • టెస్టుల్లో 437 వికెట్లు తీసిన స్టెయిన్
  • 434 వికెట్లు తీసిన కపిల్ దేవ్
  • 800 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్న ముత్తయ్య మురళీధరన్
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అధిగమించాడు. టెస్టుల్లో 437 వికెట్లతో కపిల్ దేవ్ (434)ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తో సమానంగా నిలిచాడు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ 421 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాల్లో షేన్ వార్న్ 708, కుంబ్లే 619, జేమ్స్ అండర్సన్ 575, మెక్ గ్రాత్ 563, వాల్ష్ 516లు ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో స్టెయిన్, బ్రాడ్ లు ఉన్నారు.
Go Back to Shorts
kapil dev
steyn
test
cricket
wickets

More Telugu News