జగన్ ఇంటికి చేరుకున్న ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ప్రతాప్ రెడ్డి.. నేడు వైసీపీలో చేరిక!

  • మంత్రి అఖిలప్రియ తీరు నచ్చక బయటకు
  • గతేడాది డిసెంబర్ లో రాజీనామా చేసిన నేతలు
  • లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన శిల్పా మోహన్ రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. భూమా అఖిల ప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ గతేడాది డిసెంబర్ 28న టీడీపీ సభ్యత్వాలకు ఇరిగెల సోదరులు రాజీనామా సమర్పించారు. తాజాగా వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ఈ సోదరులను హైదారాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి తీసుకొచ్చారు.

కాగా, వీరిద్దరూ ఈరోజు వైసీపీలో చేరే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వీరికి జగన్ ఏం హామీ ఇస్తారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేత గంగుల ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ వీరికి సూచించనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
iregala brothers
Telugudesam
Kurnool District
nandyal
join
Hyderabad

More Telugu News