chigurupati: ముగిసిన విచారణ.. మళ్లీ అవసరమైతే పిలుస్తామని పోలీసులు చెప్పారు: శిఖా చౌదరి

  • ఏడు గంటల పాటు విచారించిన అధికారులు
  • విచారణకు సహకరిస్తానని చెప్పిన శిఖా చౌదరి 
  • పద్మశ్రీ గురించిన ప్రశ్నలకు స్పందించని శిఖా
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి విచారణ ముగిసింది. బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీసులో సుమారు ఏడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీలు ఆమెను విచారించారు.

అనంతరం, ఆమెను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు చెప్పినట్టు తెలిపారు. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారని అన్నారు. ఈ విచారణలో పోలీసులకు తాను చెప్పిన విషయాలను బయటకు చెప్పనన్న శిఖా, విచారణకు సహకరిస్తానని పోలీసులకు చెప్పినట్టు తెలిపారు. జయరాం భార్య పద్మశ్రీ గురించి అడిగిన ప్రశ్నలకు శిఖా చౌదరి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు.
chigurupati
jayaram
shika chowdary

More Telugu News