Tammineni Seetha Ram: పోలీసులూ! ఇక ఖాకీ చొక్కాలు తీసేసి.. పచ్చ చొక్కాలు వేసుకోండి: వైసీపీ నేత తమ్మినేని సీతారాం

  • వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు
  • ఫిర్యాదు చేసినా చర్య తీసుకోవట్లేదు
  • టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని.. అసలు జిల్లాలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉందా? అని వైసీపీ నేత తమ్మినేని సీతారాం నిలదీశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఖాకీ చొక్కాలు తీసేసి.. పచ్చ చొక్కాలు వేసుకోవాలని వ్యంగ్యనగా అన్నారు.

కోటబొమ్మాళి మండల వైసీపీ కార్యాలయం, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని.. దీనికి కారణం మంత్రి అచ్చెన్నాయుడి ఆదేశాలేనని సీతారాం ఆరోపించారు. టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు దందాలు, మైన్స్‌, వైన్స్‌, సెటిల్‌మెంట్లు చేస్తూ రౌడీల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ అరాచకాలు ఆపకుంటే ప్రజలే తిరగబడతారని సీతారాం హెచ్చరించారు.
Tammineni Seetha Ram
Police
YSRCP
Kotabommali
Telugudesam
Atchannaidu

More Telugu News