చిగురుపాటి జయరాం హత్య కేసు.. పోలీసులు ముందు హాజరైన శిఖా చౌదరి!
- హత్య కేసుపై జోరు పెంచిన పోలీసులు
- శ్రీనివాస్, రాకేశ్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్
- క్రైమ్ సీన్ ను రీ కన్స్ట్రక్షన్ చేయనున్న అధికారులు
మరోవైపు ఈ కేసుకు సంబంధించి 30 మంది నిందితులను అధికారులు ఈరోజు విచారించారు. వీరిలో ప్రముఖ కమెడియన్ సూర్యప్రసాద్ అలియాస్ డుంబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్ట్ పై దృష్టి సారించిన తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో జయరాం హత్య జరిగిన రోజు రాకేశ్ రెడ్డి ఇంట్లో జరిగిన సీన్‌ను పోలీసులు రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు