Andhra Pradesh: పశ్చిమగోదావరిలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన.. శ్రీ వాసవిమాతను దర్శించుకోనున్న జనసేనాని!

  • వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
  • ట్విట్టర్ లో ప్రకటించిన జనసేనవర్గాలు
  • ఎన్నికల వేళ విస్తృతంగా పర్యటిస్తున్న పవన్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని పెనుగొండలో నూతనంగా నిర్మితమైన శ్రీ వాసవి మాత ఆలయాన్ని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జనసేన వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి.
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
Twitter
vasavi mata temple

More Telugu News