modi: ఇంటర్ పాసైన వ్యక్తిని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవద్దు.. ఎక్కడెక్కడ సంతకాలు పెడుతున్నారో కూడా అర్థం కాదు: కేజ్రీవాల్

  • 2019లో ఆ తప్పు మరోసారి చేయవద్దు
  • రాఫెల్ డీల్ వెనుక మోదీ హస్తం ఉందనే విషయం అర్థమైంది
  • ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలి
ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇంటర్ పాసైన వ్యక్తిని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవద్దని ప్రజలను కోరారు. 12వ తరగతి పాస్ అయిన వ్యక్తిని దేశ ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నారని... 2019 ఎన్నికల్లో మరోసారి ఆ తప్పిదం చేయవద్దని పిలుపునిచ్చారు. విద్యావంతుడిని ప్రధానిగా ఎన్నుకోవాలని... ఎందుకంటే, ఇంటర్ చదివిన వ్యక్తికి తాను ఎక్కడెక్కడ సంతకాలు పెడుతున్నారో కూడా అర్థం కాదని ఎద్దేవా చేశారు.

ఎక్కువ ధరకు రాఫెల్ యుద్ధవిమానాలను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ డీల్ వెనుక మోదీ హస్తం ఉందనే విషయం అర్థమయిందని... వాస్తవాలన్నీ వెలుగు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
modi
kejriwal
bjp
aap

More Telugu News