Andhra Pradesh: నాలుగున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు కదా చంద్రబాబు!: విజయసాయిరెడ్డి ఆగ్రహం

  • జగన్ పై దాడి కేసును తప్పుదోవ పట్టించారు
  • ఇప్పుడు జ్యోతి కేసులో రెండో పోస్ట్ మార్టం అవసరమొచ్చింది
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పై దాడి కేసును తప్పుదోవ పట్టించి చంద్రబాబు దొరికిపోయారని ఎద్దేవా చేశారు. తాజాగా జ్యోతి హత్య కేసులో రెండోసారి పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను నాలుగున్నరేళ్లలో భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘జగన్ గారిపై హత్యాయత్నం కేసును తప్పుదోవ పట్టించి దొరికి పోయారు. జయరాం హత్యలో నిందితులను తప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జ్యోతి హత్య కేసులో రెండో సారి పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి. నాలుగున్నరేళ్లలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు కదా చంద్రబాబు!’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Twitter
YS Vijayamma
YSRCP

More Telugu News