Tollywood: బత్తినయ్య స్వామిని ప్రార్థిస్తే నేను పుట్టాను.. అందుకే భక్తవత్సలం నాయుడని పేరు పెట్టారు!: మోహన్ బాబు

  • దాన్ని మోహన్ బాబుగా దాసరి మార్చారు
  • ట్విట్టర్ లో ఈరోజు స్పందించిన డైలాగ్ కింగ్
  • అప్పట్లో ఆలయం వద్ద దిగిన ఫొటో పోస్ట్
తన అమ్మానాన్నలకు సంతానం కలగకపోతే చిత్తూరులోని బత్తినయ్య స్వామిని ప్రార్థించారని డైలాగ్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. అందుకే తనకు భక్తవత్సలం నాయుడు అని పేరు పెట్టారని వెల్లడించారు. ఆ తర్వాత సినీరంగంలోకి వెళ్లాక దర్శకరత్న దాసరి నారాయణరావు తన పేరును మోహన్ బాబుగా మార్చారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బత్తినయ్య స్వామిని దర్శించుకున్న ఓ ఫోటోను మోహన్ బాబు ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈరోజు ట్విట్టర్ లో మోహన్ బాబు స్పందిస్తూ.. ‘మా అమ్మానాన్నలకు సంతానం కలగకపోతే శ్రీ కాళహస్తికి 14 కి.మీ. దూరంలో కొండపైన బత్తినయ్య స్వామిని ప్రార్థిస్తే నేను పుట్టానని నాకు భక్తవత్సలం నాయుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాసరిగారు మోహన్ బాబుగా మార్చారు. నా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో’ అని ట్వీట్ చేశారు.
Tollywood
MOHAN BABU
NAME
Twitter

More Telugu News