Hyderabad: తెలంగాణలో రేపు వడగళ్ల వాన!

  • వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు 
  • క్యుములోనింబస్ మేఘాలతో వర్షం
  • అల్పపీడనం కారణంగా గాలులు
వాతావరణంలో కలుగుతున్న మార్పుల వల్ల రేపు (శుక్రవారం) తెలంగాణలో అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్థాన్‌వైపు, తూర్పు భారత రాష్ట్రాల వైపు అల్పపీడనం కారణంగా గాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
Hyderabad
Telangana
meteorological department
Rain

More Telugu News