Hyderabad: ప్రేమోన్మాది భరత్ కస్టడీకి కోర్టు అనుమతి

  • ఈ నెల 6న మధులికపై కత్తితో దాడి
  • చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రెండు రోజులపాటు విచారణ
ఇంటర్ విద్యార్థిని మధులికపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ (19)ను రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడిని బుధవారం కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భరత్‌ను పూర్తిస్థాయిలో విచారించి మరిన్ని విషయాలు రాబట్టనున్నట్టు కాచిగూడ ఏసీపీ సుధాకర్ తెలిపారు.

కాగా, తన ప్రేమను నిరాకరించిన మధులికపై ఈ నెల 6న కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్‌లో భరత్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Hyderabad
Bharat
Love
Police custody
Investigation
Telangana

More Telugu News