mamata banerjee: మేం ఎవరికీ భయపడం..పోరాడతాం: సీఎం మమతా బెనర్జీ

  • కేజ్రీవాల్ కు మేము మద్దతుగా ఉన్నాం
  • మోదీని ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నాం
  • రాష్ట్రాల హక్కులను మోదీ హరిస్తున్నారు
తాము ఎవరికీ భయపడమని, పోరాడతామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద  నిర్వహించిన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, కేజ్రీవాల్ కు తాము మద్దతుగా ఉన్నామని, మోదీని ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోదీ, దేశంలో ఏ అభివృద్ధి జరిగినా తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో డెమోక్రసీ ‘నమోక్రసీ’ అయిందని దుమ్మెత్తిపోశారు. మోదీకి లోక్ సభలో ఇదే చివరిరోజని, ప్రజల  మధ్య చిచ్చు పెడుతున్న ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
mamata banerjee
kejriwal
Chandrababu
aap

More Telugu News