narendra modi: దేశంలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: మోదీపై చంద్రబాబు ఫైర్

  • విపక్ష నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి
  • మోదీ పాలన నుంచి దేశాన్ని కాపాడుకుందాం
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
దేశంలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్వహించిన ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మోదీ అప్రజాస్వామ్య పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమయ్యామని అన్నారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని, రాఫెల్ అంశంలో సుప్రీంకోర్టుకు సైతం తప్పుడు ప్రమాణ పత్రం ఇచ్చారని ఆరోపించారు. ఎక్కడ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తామంతా కలిసి ఆందోళన చేశామని, మోదీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు.
narendra modi
pm
mamata banerjee
Chandrababu
Arvind Kejriwal
delhi
aap
shatrugna sinha

More Telugu News