modi: ప్రధాని మోదీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవు: సీఎం చంద్రబాబు విమర్శలు

  • ఢిల్లీలో కేజ్రీవాల్ ధర్నాకు చంద్రబాబు మద్దతు
  • మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు కోల్పోయాం
  • కేజ్రీవాల్  పరిపాలనతో ఢిల్లీలో అద్భుతాలు చేశారు
ప్రధాని మోదీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు కోల్పోయామని విమర్శించారు.

మోదీ పాలనలో నోట్ల రద్దుతో ప్రజలు నష్టపోయారని, ఆర్థిక రంగం కుదేలైపోయిందని, రైతులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించిన చంద్రబాబు, కేజ్రీవాల్ తన పరిపాలనతో ఢిల్లీలో అద్భుతాలు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించాలని నినదించిన చంద్రబాబు, ఈ సభకు హాజరైన వారితో కూడా ఆ నినాదాలు చేయించారు. 
modi
Prime Minister
cm
Chandrababu
delhi

More Telugu News