mulayam singh: మోదీ.. మీరు మరోసారి ప్రధాని కావాలనేది నా కోరిక: సోనియా పక్కన ఉండగానే బాంబు పేల్చిన ములాయం

  • మోదీ ఎన్నో మంచి పనులు చేశారు
  • ఆయనను ఎవరూ వేలెత్తి చూపలేరు
  • లోక్ సభలో ములాయం సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. దీన్ని నిజం చేసిన మరో ఘటన లోక్ సభ సాక్షిగా చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ సభలో మాట్లాడుతూ, బాంబు పేల్చారు. 'మోదీ మీరు మరోసారి ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నా. నేను మీ వద్దకు ఎప్పుడు వచ్చినా... నా పనులను మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించారు' అని అన్నారు.

మోదీ ఎన్నో మంచి పనులు చేశారని... ఆయన వైపు ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని తెలిపారు. ఈ సమయంలో సోనియాగాంధీ పక్క సీటులోనే ఆయన ఉండటం గమనార్హం. అయితే, ములాయం వ్యాఖ్యలకు ఆమె చిరునవ్వు నవ్వారు. మరోవైపు ములాయం వ్యాఖ్యలతో మోదీ ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. తన రెండు చేతులను కలిపి ఊపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు.

ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు తమ వైరిపక్షం బీఎస్పీతో కూడా చేతులు కలిపారు. ఇలాంటి నేపథ్యంలో, ములాయం చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో వేడిని మరింత పెంచనున్నాయి.
mulayam singh
modi
sonia gandhi
bjp
sp
congress
Prime Minister
Lok Sabha

More Telugu News