sensex: వరుసగా ఐదో రోజు పతనమైన సెన్సెక్స్!

  • 119 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 37 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • నష్టాలలో ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు పతనం కాగా, నిఫ్టీ వరుసగా నాలుగో రోజు పతనమైంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 119 పాయింట్లు నష్టపోయి 36,034కు పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 10,793కు జారిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ లు టాప్ లూజర్స్ గా నిలిచాయి. టాటా మోటార్స్, టీసీఎస్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
sensex
nifty
stock market

More Telugu News