ఈసారి బీజేపీకి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి!: ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ
- బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయి
- మరోసారి ప్రధాని పీఠంపై నరేంద్ర మోదీ
- మంగళూరులో ప్రహ్లాద్ మోదీ
"2014 ఫలితమే ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ పునరావృతమవుతుంది. బీజేపీకి 300 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి" అని వ్యాఖ్యానించారు. గడచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అన్నారు. ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి వచ్చినా కాంగ్రెస్ కు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాల కూటములు గతంలో ఎన్నోమార్లు విఫలమయ్యాయని, ఇప్పుడూ అదే జరుగుతుందని చెప్పారు.