పెళ్లి విందు రుచిగా లేదట... చావగొట్టారు!
- న్యూఢిల్లీలో ఘటన
- ఓ హోటల్ లో వివాహ వేడుక
- భోజనం సరిగ్గా లేదంటూ నానాయాగీ
మగపెళ్లివారు, ఆడపెళ్లివారు కొట్టకుంటున్న దృశ్యాలు, ఆపై హోటల్ స్టాఫ్ ను అందరూ కలిసి కొడుతున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఓ హోటల్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి దాదాపు 500 మందికి పైగా అతిథులు వచ్చారు. వారందరికీ విందు భోజనం వడ్డించే కాంట్రాక్టును హోటల్ కే అప్పగించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.