New Delhi: ఢిల్లీ అర్పిత్ ప్యాలెస్ లో ఘోర అగ్నిప్రమాదం... 9 మంది సజీవ దహనం!

  • కరోల్ బాగ్ ప్రాంతంలో ఉండే అర్పిత్ ప్యాలెస్
  • మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది కృషి
  • కాలిన గాయాలతో బయటకు పరుగులు పెట్టిన అతిథులు
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యమూ ఎంతో బిజీగా ఉండే కరోల్‌ బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్‌ ప్యాలెస్‌ అనే హోటల్‌ లో మంటలు చెలరేగాయి. హోటల్ లో ఉన్న అతిథుల్లో 9 మంది సజీవ దహనమయ్యారు. హోటల్ లో ఇంకా చాలా మంది ఉండటంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 10కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి. కాలిన గాయాలతో బయటకు పరుగులు పెడుతున్న వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి కారణం ఇంకా వెల్లడికాలేదు. 
New Delhi
Fire Accident
Arpit Pallace

More Telugu News