Chandrababu: చంద్రబాబుతో కలసి రాష్ట్రపతి భవన్ కు పాదయాత్ర చేసేది ఎవరంటే..!

  • ఉదయం 11 గంటలకు పాదయాత్ర మొదలు
  • బాబు వెంట అశోక్ గజపతిరాజు, చినరాజప్ప
  • కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు కూడా
ఈ ఉదయం 11 గంటల తరువాత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ పాదయాత్ర చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్ పర్సన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ సెక్రటేరియేట్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మురళీకృష్ణ పాల్గొంటారు. వీరితో పాటు ఆంధ్రా మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సినీ నటుడు శివాజీ చంద్రబాబుతో పాటు నడుస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Chandrababu
New Delhi
Padayatra

More Telugu News