‘రాఫెల్’ ఒప్పందంలో ‘ఉల్లంఘన’.. ద హిందూ పత్రిక కథనంతో ప్రకంపనలు
- రాఫెల్ ఒప్పందంపై తొలి నుంచీ అనుమానాలు
- అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వమే ఇలా..
- కీలకమైన ఎస్క్రో ఖాతా నిర్వహణను ఎగరగొట్టేశారంటూ కథనం
భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదరగా దసో ఏవియేషన్ సరఫరాదారుగా ఉండనుంది. అయితే, ప్యాకేజీ బాధ్యతలను మాత్రం ఎంబీడీఏ ఫ్రాన్స్ నిర్వహిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ రెండూ ప్రైవేటు సంస్థలే. అయితే, దసో-ఎంబీడీఏలతో కుదిరిన సరఫరా ప్రోటోకాల్స్ నుంచి కీలకమైన నిబంధనను ఎగరగొట్టేశారని పత్రిక తన కథనంలో పేర్కొంది.
అత్యున్నత రాజకీయ జోక్యం వల్లే ఇది సాధ్యమైందని, చివరి నిమిషంలోనే ఈ మార్పు జరిగిందని వివరించింది. ఎస్క్రో ఖాతా లేకపోవడం వల్ల భారత వైమానిక దళానికి ఒరిగేదేమిటని ప్రశ్నించింది. కీలకమైన నిబంధనను ఉల్లంఘించి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన భారత చర్చల బృందంలోని ముగ్గురు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదని పేర్కొంది.