‘అలాదీన్’ సినిమా ట్రైలర్ విడుదల.. జీనీగా అదరగొట్టిన సూపర్ స్టార్ విల్ స్మిత్!
- అరేబియన్ జానపద కథతో సినిమా
- తెరకెక్కించిన దర్శకుడు గుయ్ రిట్జీ
- 2019, మే 24న రిలీజ్ కు సన్నాహాలు
హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్, నయోమి స్కాట్, మేనా మస్సుద్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విల్ స్మిత్ ‘అలాదీన్’లో జీనీగా నటించారు. షెర్లాక్ హోమ్స్ సినిమాలను తెరకెక్కించిన గుయ్ రిట్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2019, మే 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి.