New Delhi: ఢిల్లీలోని ఏపీ భవన్‌ సమీపంలో తెలుగు వ్యక్తి మృతదేహం

  • ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
  • జేబులోని లేఖ ఆధారంగా మృతుడు శ్రీకాకుళం వాసిగా గుర్తింపు
  • రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో మృతదేహం
ఢిల్లీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశరాజధానిలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ సమీపంలో ఇతని మృతదేహాన్ని ఈరోజు గుర్తించారు. చక్రాల కుర్చీలో చనిపోయి పడివున్న ఇతన్ని గుర్తించిన ఏపీ భవన్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి వివరాల కోసం వెతికారు. ఇతని వద్ద ఒక లేఖ, కుర్చీ పక్కనే బాటిల్‌, 20 రూపాయల నోటు లభ్యమయ్యాయి. లేఖ ఆధారంగా మృతుడిని శ్రీకాకుళం వాసిగా గుర్తించారు. పక్కనే ఉన్న సీసా పురుగుల మందు అయి ఉంటుందని, బహుశా దీన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తరలించారు.
New Delhi
ap bhavan
one suecide

More Telugu News