Tollywood: రాజన్నే స్క్రీన్ మీదకు వచ్చేశాడా అనిపించింది.. ’యాత్ర’ టీమ్ పై సురేందర్ రెడ్డి ప్రశంసలు!

  • యాత్ర సినిమా నిజంగా ఎమోషనల్ జర్నీనే
  • చాలా సీన్లలో భావోద్వేగానికి లోనయ్యాను
  • ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి యాత్ర సినిమాపై ప్రశంసలు కురిపించారు. యాత్రను అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర యూనిట్ ను అభినందించారు.
ఈరోజు సురేందర్ రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘యాత్ర సినిమాను చూశాను. ఇది నిజంగా ఎమోషనల్ జర్నీనే. చాలా సీన్లలో భావోద్వేగానికి లోనయ్యా. ఈ సినిమాలో మమ్ముట్టి గారి నటన అద్భుతంగా ఉంది. ఎంతలా అంటే  రాజన్నే స్వయంగా స్క్రీన్ మీద ఉన్నారా? అని నాకు అనిపించింది. ఇలాంటి అద్భుతాన్ని తెరకెక్కించిన యాత్ర తారాగణం మరియు సిబ్బందికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Tollywood
yatra
movie
surender reddy
ysr
praise
Twitter

More Telugu News