Chandrababu: రాజ్‌ఘాట్‌కు చంద్రబాబు.. గాంధీ విగ్రహానికి నివాళులు

  • దీక్షకు కూర్చోనున్న చంద్రబాబు
  • గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు
  • 12 గంటలపాటు కొనసాగనున్న దీక్ష
విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో ఢిల్లీలో దీక్షకు కూర్చోనున్నారు. గత రాత్రే దేశ రాజధానికి చేరుకున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఎంపీలతో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సరిగ్గా ఎనిమిది గంటలకు దీక్ష ప్రారంభించనున్నారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే 12 గంటలపాటు దీక్ష కొనసాగనుంది.

దీక్షకు సంఘీభావం తెలుపుతూ అందులో పాల్గొనేందుకు ఏపీ నుంచి వివిధ సంఘాల నేతలు, విద్యార్థి నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ నేతలు కూడా చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలుపుతూ హాజరుకానున్నారు.
Chandrababu
New Delhi
BJP
Narendra Modi
Rajghat
Congress

More Telugu News