KA Paul: ఈ ధర్నాలు, దీక్షలు అంతా బూటకమే: కేఏ పాల్

  • ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు వారిద్దరూ రెడీ
  • మోదీ పాలనలో బాగుపడింది వారే
  • పోలీసులు నాకు భద్రత కల్పించడం లేదు
ఏపీపై కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టనున్న దీక్షపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, జగన్ చేపట్టే ధర్నాలు, దీక్షలు అన్నీ బూటకమేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు, జగన్‌లు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం  దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని, మోదీ పాలనలో అంబానీ, అదానీలే తప్ప పేదలు బాగుపడలేదన్నారు. తెలుగు ప్రజలను మోసం చేస్తున్నందుకే మోదీ ఫెయిలయ్యారని పేర్కొన్న పాల్.. తన హత్యకు కుట్ర జరుగుతోందని పోలీసులను ఆశ్రయించినా తనకు భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
KA Paul
Prajashanthi party
Chandrababu
Narendra Modi
Jagan

More Telugu News