సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళంలో సమంత మరో చిత్రం 
  • సినిమాపై వివరణ ఇచ్చిన మారుతి
  • 'వర్మ'కు గౌతమ్ మీనన్ దర్శకత్వం?    
*  ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న కథానాయిక సమంతకు విజయ్ సేతుపతి తమిళ చిత్రం నుంచి మరో ఆఫర్ వచ్చింది. నూతన దర్శకుడు ఢిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే 'తుగ్లక్ దర్బార్' చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ఆమెను అడుగుతున్నారట. త్వరలోనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం.
*  దర్శకుడు మారుతి 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం తర్వాత తన తదుపరి చిత్రాలను నాని, సాయిధరం తేజ్ లతో చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి తాజాగా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. ఆయా వార్తలలో వినిపిస్తున్న హీరోలతో చేయాలని తనకూ వుందని, అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నానని, ఇంకా ఏ హీరో ఫైనల్ కాలేదని పేర్కొన్నాడు.  
*  విక్రం తనయుడు ధృవ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ బాల దర్శకత్వంలో 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని 'వర్మ' పేరిట తమిళంలో రీమేక్ చేసిన సంగతి విదితమే. అయితే, సినిమా అవుట్ పుట్ సరిగా రానందున మొత్తం రీ షూట్ చేయాలని భావించినట్టు, దర్శకుడిని మారుస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దీనికి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
Samantha
Vijay
Maruti
nani

More Telugu News