Andhra Pradesh: ఆ పేపర్ లో అన్నీ అసత్య వార్తలే..పేజీలకు పేజీలు రాస్తారు!: సీఎం చంద్రబాబు

  • ‘పసుపు-కుంకుమ’ డబ్బులు ‘రుణం’ అని రాశారు
  • వీళ్లకు బుద్ధి ఉందా? లేదా?
  • అలాంటి పనికి రాని పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి
వైసీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తారని, మైండ్ గేమ్ ఆడతారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. నెల్లూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అలాంటి పనికిరాని పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేయాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా చేస్తేనే మన రాష్ట్ర అభివృద్ధికి అడ్డం ఉండదని వ్యాఖ్యానించారు.

ఓపక్క అనునిత్యం సమస్యలతో పోరాడాలి, మరోపక్క ఇలాంటి వాళ్లతో కూడా పోరాడాలంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.   ఒక పేపర్ పెట్టుకున్నారని, ఆ పేపర్ లో అన్నీ అసత్య వార్తలేనని చంద్రబాబు ఆరోపించారు. ఆ వార్తలు చూస్తే మన మైండ్ కూడా పాడైపోతుందని, అసత్య వార్తలను ఆ పేపర్ లో పేజీలకు పేజీలు రాస్తారని దుయ్యబట్టారు. ‘మొన్నొక వార్త రాశారు. మా ఆడబిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ కింద డబ్బులిస్తే, రుణం కింద ఇచ్చామంటూ రాశారంటే, వీళ్లకు బుద్ధి ఉందా? లేదా?’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. 
Andhra Pradesh
Nellore District
cm
Chandrababu

More Telugu News