Nellore District: భావి తరాల కోసం టీడీపీని గెలిపించండి: సీఎం చంద్రబాబు

  • గతంలో నెల్లూరు జిల్లాలో 3 స్థానాల్లోనే గెలిపించారు
  • ఈసారి మొత్తం పదికి పది స్థానాల్లో టీడీపీని గెలిపించాలి
  • రాజకీయాలు చాలా దుర్మార్గంగా తయారయ్యాయి
భావి తరాల కోసం టీడీపీని గెలిపించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. నెల్లూరులో జరుగుతున్న సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిపించారని, ఈసారి మొత్తం పదికి పది స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఇక్కడి అభ్యర్థుల ఎంపికను చాలా జాగ్రత్తగా చేస్తానని, ఓటు వేసే ముందు చంద్రన్న చేసిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు చేశారు. రాజకీయాలు చాలా దుర్మార్గంగా తయారయ్యాయని, వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని, పార్లమెంటుకు వెళ్లరని, మోదీని నిలదీయాల్సి వస్తుందని ఇంట్లోనే ఉంటారని విమర్శించారు. అసెంబ్లీకి రాని వైసీపీ నేతలు జీతాలు మాత్రం  ఠంచన్ గా తీసుకుంటారని సెటైర్లు విసిరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధిలో మనతో పోటీ పడలేరని, ఆ రాష్ట్రం నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.5 వేల కోట్లు ఇవ్వడం లేదని విమర్శించారు.
Nellore District
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News