పార్టీ ముఖ్య నాయకులతో రాహుల్‌ ఢిల్లీలో సమావేశం

సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాలకు పదును పెట్టడం మొదలు పెట్టారు. ఈరోజు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించే విషయమై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. కాగా, సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, రఘువీరారెడ్డిలు హాజరయ్యారు.

Rahul Gandhi
pcc chiefs
clp leaders
new delhi

More Telugu News