ఆ టేపు నకిలీది.. నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: యడ్యూరప్ప
- కుమారస్వామి విడుదల చేసిన టేపు నకిలీది
- నాగనగౌడకు డబ్బు ఎరవేసేందుకు యత్నించాననే ఆరోపణల్లో నిజం లేదు
- ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుమారస్వామి ఈ డ్రామాలు ఆడుతున్నారని యెడ్డీ అన్నారు. కుమారస్వామి ఓ సినీ నిర్మాత అని... వాయిస్ రికార్డింగ్ లో ఆయనకు మంచి నైపుణ్యం ఉందని... ఈ వీడియోను కూడా అలాగే సృష్టించారని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ కు కూడా డబ్బును ఆశజూపానని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.