ఇంకా విషమంగానే మధులిక ఆరోగ్యం.. ఇన్ఫెక్షన్ సోకే అవకాశముందన్న వైద్యులు!
- నిన్న హైదరాబాద్ లోని బర్కత్ పురాలో దాడి
- ప్రేమించలేదన్న అక్కసుతో యువకుడి దారుణం
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మధులిక ఇంటికి సమీపంలో ఉండే సి.భరత్(20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమించాలంటూ రెండేళ్లుగా అతడు బాలిక వెంటపడుతున్నాడు. ఇందుకు మధులిక అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. బాలికపై కొబ్బరి బొండాల కత్తితో నిన్న దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మధులిక చేతి వేళ్లు తెగిపోగా, ఎడమచేతికి, మెడకు, తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో భరత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు.