Narendra Modi: మోదీ కోసం కేసీఆర్, జగన్ కలిసి కపట నాటకం ఆడుతున్నారు: సీఎం చంద్రబాబునాయుడు

  • ఫెడరల్ ఫ్రంట్ ఓ బూటకం
  • ‘మోదీ ఫ్రంట్’ ఏర్పాటుకు చూస్తున్నారు
  • దేశాన్ని భ్రష్టుపట్టించే పరిస్థితికి వచ్చారు
తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ ఓ బూటకమని, మోదీ కోసం కేసీఆర్, జగన్ కలిసి కపట నాటకం ఆడుతున్నాయని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇప్పటి వరకు కేసీఆర్ రెండు సార్లు కలిశారని, ఆయన సీఎం కాకముందు, అయిన తర్వాత ఆమెను కలిశారని అన్నారు. ఆమెపై సీబీఐ తీరును దేశ మంతా ఖండించిందని, చివరకు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఖండించారు కానీ, కేసీఆర్, జగన్ మాత్రం ఖండించలేదని ఎద్దేవా చేశారు.

ఎంత గొప్పనాయకులు? పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదనుకుంటుంది, వీళ్లిద్దరి కపట నాటకాన్ని దేశమంతా చూస్తోందని దుయ్యబట్టారు. ముగ్గురు మోదీలు కలిసి మోదీ ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఈరోజున దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు.
Narendra Modi
kcr
KTR
jagan
Chandrababu

More Telugu News