ఏపీలోని 25 నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు తప్పదు.. వైసీపీ నేత సజ్జల సంచలన ప్రకటన!
- 150 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలే బరిలోకి
- మిగిలిన చోట్ల నాయకత్వ మార్పు తథ్యం
- ఒంగోలులో మీడియాతో వైసీపీ నేత
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించబోమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల సూచించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నమ్మించి మోసం చేశారన్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అలాంటి ఎత్తుగడ వేస్తున్నారని మండిపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.