Ali: పవన్ కోరితే జనసేన పార్టీకి ప్రచారం చేస్తా: హాస్యనటుడు అలీ

  • పవన్, అలీల మధ్య సత్సంబంధాలు
  • సినిమా వేరు, పార్టీ వేరన్న అలీ
  • పవన్ తనను ఆహ్వానించలేదని స్పష్టం
జనసేన అధినేత పవన్ కల్యాణ్, హాస్య నటుడు అలీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తన అన్ని చిత్రాల్లో అలీని పక్కన పెట్టుకుని కామెడీ చేయడం పవన్ కు ఎంతో ఇష్టం. ఇక, అలీ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత, అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిశారన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్ తదితరులతో అలీ భేటీ అయ్యారు. తాజాగా, తన రాజకీయ రంగ ప్రవేశంపై 'ఐడ్రీమ్స్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

తాను జనసేన పార్టీలో చేరబోవడం లేదని, ఏ పార్టీలో చేరుతానో అతి త్వరలో చెబుతానని అన్నారు. సినిమా వేరు, స్నేహం వేరు, పార్టీ వేరు అని వ్యాఖ్యానించిన అలీ, తనను ఎన్నడూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరాలని కోరలేదని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం అభిమానినన్న విషయం పవన్ కు తెలుసునని చెప్పారు. పవన్ కోరితే జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్ధమని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావించానని, ఆ మేరకు కోరుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. 

Ali
Pawan Kalyan
Jana Sena

More Telugu News