Hyderabad: విద్యార్థినిపై దాడి కేసులో విస్తుగొలిపే వాస్తవాలు.. ఆమె తల్లికి ఫోన్ చేసి బెదిరించిన ప్రేమోన్మాది

  • తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష
  • బాలిక తల్లికి ఫోన్ చేసి బెదిరింపు
  • ఘటన తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన భరత్ తల్లిదండ్రులు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని (17)పై దాడి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు చిట్టూరి భరత్ (19) దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల విచారణలో ఈ ఘటనకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రేమ పేరుతో వేధిస్తున్న భరత్‌ను బాలిక దూరం పెట్టే కొద్దీ అతడు మరింతగా రెచ్చిపోయాడు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్న అతడి ఆగడాలు మరింత శ్రుతి మించడంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలి తండ్రి.. భరత్‌ను మందలించాడు. అయినప్పటికీ భరత్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు భరత్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోని భరత్ బాలికపై మరింత కక్షపెంచుకున్నాడు. అంతేకాదు, ఆమె తల్లికి ఫోన్ చేసి ‘‘నీ బిడ్డను ప్రేమిస్తున్నా.. ఏం చేసుకుంటావో చేసుకో’’ అని హెచ్చరించాడు.  కాగా, భరత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి అరెస్ట్‌తో భరత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు.
Hyderabad
Love murder
Chitturi Bharat
Telangana

More Telugu News