మోదీకి ఖాళీ కుండలతో స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయం.. టీడీపీ మద్దతు
- 10న గుంటూరులో, 16న విశాఖలో మోదీ పర్యటన
- విభజన హామీలు అమలు చేయనందుకు నిరసన
- ఢిల్లీకి ప్రత్యేక రైళ్లలో పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, కార్మికులు
మరోపక్క, ఈ నెల 11న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయనున్న దీక్షకు సంఘీభావం తెలపటానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధుల్ని తీసుకు వెళ్లనున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు రైళ్లు బయలుదేరనున్నాయి. అలాగే, ఈ నెల 8న వచ్చీపోయే వాహనాల్ని శుభ్రం చేస్తూ గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలపాలని జేఏసీ నిర్ణయించింది.