నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
- నాగపూర్ లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
- ఇంటిని చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడతారు?
- గడ్కరీ వ్యాఖ్యలపై రాజకీయంగా ఆసక్తికర చర్చ
నాగపూర్ లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా మంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించే గడ్కరీ చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.