mahabubnagar dist: నారాయణపేట జిల్లాలో కోయిల్ కొండను కలపొద్దంటూ ఆందోళన..సీఐ తలకు తీవ్రగాయం!

  • దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా-వార్పు కార్యక్రమం
  • హింసాత్మకంగా మారిన నిరసన ఆందోళన  
  • పోలీసులపై  రాళ్లు రువ్విన ఆందోళనకారులు
మహబూబ్ నగర్ జిల్లాలో కోయిల్ కొండ మండలం ఉంది. ఈ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపొద్దంటూ కోయిల్ కొండ వాసులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్- కోయిల్ కొండ మార్గంలో ఉన్న దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనా కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సీఐ పాండురంగారావు తలకు తీవ్ర గాయమైంది. సీఐను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
mahabubnagar dist
koyal konda
narayanapet

More Telugu News