roha: చంద్రబాబు తంతే రోజా పాతాళ లోకానికి వెళ్తారు: దివ్యవాణి

  • రోజా ఔట్ డేటెడ్ నాయకురాలు
  • నాలుగేళ్లు ఎమ్మెల్యేగా చేసి ఎగిరెగిరి పడుతున్నారు
  • పరిటాల కుటుంబంపై వైసీపీ నేతలు బురదజల్లుతున్నారు
కేవలం నాలుగేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన రోజానే ఎగిరెగిరి పడుతుంటే... 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎలా మాట్లాడాలని టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి అన్నారు. రోజా ఔట్ డేటెడ్ నాయకురాలని ఆమె ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రోజాకు పరాభవం తప్పదని చెప్పారు. చంద్రబాబు తంతే రోజా పాతాళ లోకానికి వెళ్తారని అన్నారు. కోడికత్తి డ్రామా మాదిరే వైసీపీ నేతలు రేపు చేప ముల్లు డ్రామా ఆడతారని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ పథకానికి అనుకూలమా? కాదా? అనే విషయాన్ని రోజా చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే వైసీపీ నేతలకు బాధ ఎందుకని ప్రశ్నించారు. పరిటాల కుటుంబంపై బురదజల్లే ప్రయత్నాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారని... వారి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని చెప్పారు. వైసీపీ నేతల మాటలతో మహిళల గుండెల్లో గునపాలు గుచ్చుకుంటున్నాయని అన్నారు. ఫ్యాక్షన్ గడ్డ రాయలసీమను చంద్రబాబు పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
roha
ysrcp
chandrababu
divyavani
Telugudesam
paritala

More Telugu News