సంచలనం కోసం వార్తలు రాస్తారా?: ఉప రాష్ట్రపతి వెంకయ్య ఆవేదన
- ఒకప్పుడు సామాజిక సమస్యలు పారదోలేందుకు వార్తలు రాసేవారు
- ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాస్తున్నారు
- జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింది
తామేం చేస్తున్నామన్న దానిపై ఫోర్త్ ఎస్టేట్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంచలనం కోసం ప్రయత్నించడం, చెల్లింపు వార్తలు, పక్షపాత వైఖరితోపాటు నకిలీ వార్తలు కూడా జర్నలిజానికి పెను సమస్యగా పరిణమించాయన్నారు. బ్రిటిష్ పాలనలోను, ఎమర్జెన్సీ సమయంలోను వార్తా పత్రికలు కీలక పాత్ర పోషించాయని వెంకయ్య గుర్తు చేశారు.
వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు.. ఇలా ఎవరికిపడితే వారు స్వప్రయోజనాల కోసం సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకోవడం వల్ల జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింటోందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రచురించే వార్తల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇష్టారీతిన వార్తలు రాయకుండా మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలని ఉప రాష్ట్రపతి కోరారు.