simbu: తమిళ 'అత్తారింటికి దారేది'కి బ్యాడ్ టాక్

  • తెలుగులో హిట్ కొట్టిన 'అత్తారింటికి దారేది'
  • శింబు హీరోగా తమిళంలో రీమేక్
  • నిన్న విడుదల కాగా నెగెటివ్ టాక్  

తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా చేసిన 'అత్తారింటికి దారేది' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఆయన పవన్ ను చాలా స్టైలీష్ గా .. హ్యాండ్సమ్ గా చూపించాడు. మాస్ ఆడియాన్స్ కి కావలసిన అంశాలను జోడిస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అలాంటి ఈ సినిమాను 'వంత రాజవతన్ వరువేన్' పేరుతో తమిళంలో రీమేక్ చేశారు.

శింబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన కేథరిన్ .. మేఘ ఆకాశ్ మెరిశారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ నటించింది. నిన్న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా .. బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాల పరంగా ఈ సినిమా పూర్తిగా నిరాశ పరిచిందని అక్కడి క్రిటిక్స్ రాశారు. శింబు చేసిన ఓవరాక్షన్ వెగటు పుట్టించిందనే మాట సాధారణ జనాల నుంచి వినిపిస్తోంది. మొత్తానికి ఇక్కడ పవన్ ఫ్యాన్స్ ను హుషారెత్తించిన ఈ సినిమా, అక్కడ శింబు అభిమానులు డీలా పడేలా చేసిందన్న మాట. 

More Telugu News