ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని ఆర్థిక సాయంతో బతికించిన గొప్ప వ్యక్తి ప్రకాశ్ రాజ్: నటుడు రాజా రవీంద్ర
- ప్రకాశ్ రాజు ఇంటికి పిలిచాడు
- ఇంతవరకూ ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు
- ఒక ఆర్టిస్ట్ ప్రాణాలు కాపాడాడు
ఇక వేరే భాషకి సంబంధించిన ఒక పెద్ద ఆర్టిస్ట్ .. ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం ప్రకాశ్ రాజ్ కి తెలిసి .. తనని వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నాడు. నేను ఆ వ్యక్తిని ప్రకాశ్ రాజ్ ఇంటికి తీసుకెళ్లాను. 'ఎంత అప్పు వుంది మీకు' అని ఆ ఆర్టిస్ట్ ని ప్రకాశ్ రాజ్ అడిగాడు .. '50 లక్షలు' అని చెప్పాడాయన. 'ఇక ఆ అప్పు సంగతి మరిచిపో .. ప్రాణాలు తీసుకుందామనే ఆలోచన కూడా మరిచిపో' అని ఆ మొత్తం సాయం చేశాడు. డబ్బుకన్నా మానవతా విలువలకి అంతటి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు" అని చెప్పుకొచ్చాడు.