సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజమౌళి సినిమా కోసం అలియా భట్ 
  • మహేశ్ బాబు కి మరో ఎండార్స్ మెంట్ 
  • వెరైటీ టైటిల్ రిజిస్టర్ చేసిన దిల్ రాజు
 *  ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఓ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ నటి అలియా భట్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. తన మిత్రుడు కరణ్ జొహార్ ద్వారా ఆమెను రాజమౌళి కాంటాక్ట్ చేస్తున్నాడట. త్వరలో ఖరారు చేస్తారని అంటున్నారు.
*  ప్రముఖ నటుడు మహేశ్ బాబు తాజాగా మరో ఎండార్స్ మెంటు కి కమిట్ అయ్యాడు. అంతర్జాతీయ డియోడరెంట్  బ్రాండ్ డెన్వర్ కి దక్షిణాది మొత్తానికి బ్రాండ్ అంబాసడార్ గా డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటన కోసం త్వరలో ముంబయ్ లో షూటింగులో పాల్గొంటాడు.  
 *  రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'ఆడు మగాడ్రా బుజ్జి' ఫేం కృష్ణారెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రం కోసం 'నీదీ నాదీ ఒకటే లోకం' అనే టైటిల్ని తాజాగా రిజిస్టర్ చేశారు.
Go Back to Shorts
Aliya
NTR
Charan
Mahesh Babu

More Telugu News